[:en]
మనబడి ప్రచారం… 60 అడుగుల హోర్డింగ్
ఇంటర్నెటెడెస్క్, హైదరాబాద్: భాషా సేవయే భావికు సేవ అనే నమ్మకంతో అమెరికా వ్యాప్తంగా 6000 మందికి పైగా విద్యార్థులకు విజయవంతంగా తెలుగు నేర్పిస్తున్న సిలికానాంధ్ర మనబడి మరోసారి తమ విశిస్టతను చాటుకుంది. మనబడి ప్రచార కార్యక్రమంలో భాగంగా న్యూజెర్సీ-న్యూయార్క్ ప్రధాన రహదారిపై 60 అడుగుల మనబడి హోర్డింగ్‌తో ఆకట్టుకుంది. ప్రతీరోజూ వేలాది మంది ప్రయాణించే మార్గం కావడంతో అక్కడ ఈ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశామని మనబడి ఉపాధ్యక్షులు శరత్ వేట తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన మనబడి వార్షిక పరీక్షలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నట్టు తెలిపారు. అలాగే 2016-17 విద్యా సంవత్సరం మనబడి తరగతులు ప్రారంభం కానున్నట్లు మనబడి అధ్యక్షుడు రాజు చమర్తి తెలిపారు. తెలుగు భాషా ప్రచారంలో భాగంగా ఈ హోర్డింగ్‌ను ఏర్పాటు చేయడంపై ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మనబడి ఆర్థిక వ్యవహారాల ఉపాధ్యక్షులు దీనబాబు కొండుభట్ల పాల్గొన్నారు.
[:te]
మనబడి ప్రచారం… 60 అడుగుల హోర్డింగ్
[:]