తెలుగు నేర్చుకో, ప్రాముఖ్యాన్ని తెలుసుకో! - సౌజన్య ఆలపాటి
దేశభాషలందు తెలగు లెస్స అన్నారు మన శ్రీకృష్ణదేవరాయలు గారు! ఎందరో మహానుభావులు అందరికీ వందనములు!పంచదార కన్న పనస తొనల కన్న కమ్మని తేనె కన్న తెలుగు మిన్న.
తెలుగు అనేది భారతదేశంలోని దక్షిణ భాగంలో మాట్లాడే ఒక ముఖ్యమైన భాష. తెలుగు లిపి, బ్రాహ్మి కుటుంబానికి చెందినది . తెలుగు భాష, ద్రవిడ భాషగా, భారతదేశం యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో కాకుండా, ఇతర పరిసర రాష్ట్రాలలోను మాట్లాడబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే ప్రజల సంఖ్యలో ఇది ఒక ముఖ్యమైన భాష.ఇది భారత గణతంత్రం యొక్క అధికారిక లిపులలో ఒకటి.
తెలుగు భాష నేర్చుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి.పిల్లలకు భాషా నైపుణ్యాలు , పదజాలం, శబ్ద నిర్మాణం మరియు భావన యొక్క లోతైన అర్థాలను అర్థం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. ఇది ఇతర భాషలు నేర్చుకోవడంలో కూడా సహాయపడుతుంది, ఉదాహరణకు కన్నడ మరియు తెలుగు భాషలు ద్రవిడ భాషా కుటుంబం మూలాల్ని కలిగి ఉన్నాయి, తద్వారా కన్నడ బాష నేర్చుకోవడం సులభ తరం అవుతుంది. వారి సామర్థ్యాలు పెరుగుతాయి.
విద్యార్థులు తమ సంస్కృతి, సంప్రదాయ మూలాల్ని తెలుసుకుంటారు. ఇది వారి సామాజిక దృక్పథాన్ని విస్తరించి, వారిని సమాజంలో బాధ్యతాయుతంగా మరియు గౌరవనీయంగా పెంచుతుంది.
భారతీయ మరియు దక్షిణ ఆసియా ప్రాంతాలలో సంభాషణ చేయగలుగుతారు. దీంతో, భవిష్యత్తులో అనేక వివిధ పరిశ్రమల్లో మంచి అవకాశాలు, అంతర్జాతీయ సంబంధాలు, వ్యాపారాలు మరియు ఉద్యోగాలలో రాణించగలరు.
కొత్త భాష అందులో తెలుగు బాష నేర్చుకోవడం మెదడుకు పెట్టె మేత. అందువలన మొదటిలో అతి కష్టతరముగా అనిపించొచ్చు, కానీ మన పెద్దవారు కష్టే ఫలి అన్నారు. మన మెదడుకు భాష నేర్పిస్తే అది మనకు అనేక జ్ఞాన సంబంధిత లాభాలను కూడా అందిస్తుంది. ఎన్నో పరిశోధనలు చూపించాయి ద్వి భాషా జ్ఞానము మరియు బహుభాషా జ్ఞానము ఉన్నవారిలో పనితీరునుపెంచుతుంది. స్మృతి, మరియు సమస్య పరిష్కరణ వంటి పనులను మెరుగుపరచగలవు. మెరుగైన సృజనాత్మకతను, అభ్యాస విధానాలను మరియు ఆలోచించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుంది. భాషలు అర్ధం చేసుకొనే అంతరాయాలను తొలగించి, వివిధ దృష్టికోణాల నుండి ఆలోచించడంలో కూడ సహాయపడతాయి.
విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పరీక్షలు, పోటీలలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. దీనివల్ల వారు కళాశాల ప్రవేశాలకు, విద్యాభ్యాస నిధి అవకాశాలకు మరియు ఇతర పోటీ పరీక్షలకు సిద్దంగా ఉండగలరు.
పాఠ్యాంశాలను పఠిస్తూ, భాషా పరిజ్ఞానం తో విద్యార్థులు రచన మరియు వ్యాస రచనా నైపుణ్యాలను మెరుగుపరచుకుంటారు, ఇవి తమ విద్యాభ్యాస పనితీరును గొప్పగా మార్చుతాయి. తెలుగు భాష గొప్పదనం దిన దినాభివృద్ధి చెందుతుంది అంటే అతిశయోక్తి కాదేమో… ఉత్తర అమెరికాలో పలు రాష్ట్రాల పాటశాలలో చదివేందుకు బర్తి చేసె ధారకాస్తు పత్రాలు కూడా తెలుగు భాషలో అనువదించి ఉంటాయి. ఇతర దేశాలు కూడా గౌరవించే భాష మన తెలుగు భాష.
మాటలు కరువాయె, మనసే మూగబోయె అనే పరిస్థితిలో మన తాతయ్యలు, అమ్మమ్మలు మరియు ఇతర కుటుంబ సభ్యులు సొంత ఊరిలో ఉండి, ఇత ర దేశాన ఉన్న మనవాళ్ళు మనవరాళ్లతో మాట్లాడలేక పిల్లలు మాట్లాడే ఆంగ్లబాష అర్ధం కాక వారిలో వారే చాలా బాద పడుతున్నారు. పిల్లలకి తెలుగు బాష నేర్పడం వల్ల పెద్దవాళ్లతో సునాయాసంగా వాళ్ళు చెప్పాలనుకున్నది హవా భావాలతో, తేనెలోలుకు మాటలతో మాట్లాడుతుంటే ఆ పెద్దవాళ్ల ఆనందానికి అవధులు లేవు.
తెలుగు నేర్చుకో, ప్రాముఖ్యాన్ని తెలుసుకో,
భాషలో బలమూ, జ్ఞానమే జ్ఞానమో!
అది కేవలం మాట కాదు, అది ఒక బ్రహ్మాస్త్రం..
తెలుగులోని ప్రతి పదం, అనుభూతుల మయం..
సంప్రదాయం, సంస్కృతి, మన ఆత్మ గౌరవం..
తెలుగు పఠనం, కాంతినిచ్చే మహా జ్ఞానం..
ప్రతి పదం పరిమళం, ప్రతీ వాక్యం స్వరం..
తెలుగు భాషల తీయదనం అనంతం..
మాతృభాష మనకు బలాన్ని ఇస్తుంది..
సాంస్కృతిక దారులపై నడిపిస్తుంది..
ప్రతి పదం మురిపంగా, ప్రతి వాక్యం గౌరవంగా,
మన మాతృభాష గర్వంగా, తెలుగు భాషే మక్కువగా..
మన సాహిత్యం, సంస్కృతికి ఆకృతి..
శాస్త్రాలు, సంగీతం, కళ, ఇమడిన ప్రకృతి
ఎన్నో స్మృతుల మాధురి..కొత్త స్వరాల ఊపిరి..
ప్రపంచాన్నంతా గొప్పదిగా చూపించు తెలుగులో జీవించు, తెలుగు ను పరిరక్షించు.
మన వేదాలు, ఉపనిషద్లు, తెలుగు లోనే రచించబడ్డవి. తెలుగులో వ్రాసిన కావ్యాలు, గానాలు,ప్రపంచం చరిత్రలో ముద్ర వేసినవి.
మన సంస్కృతిని అర్థం చేసుకోగలిగితే,ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.
మన దేశంతో పాటు..ఇతర దేశాలు కూడా గౌరవించే భాష మన తెలుగు భాష. నేను తెలుగు గడ్డ మీద పుట్టి తెలుగు మాట్లాడుతున్నందుకు ఎంతగానో గర్విస్తున్నాను. నాకు తెలుగు నేర్పిన అమ్మా, నాన్న, గురువులు మరియు
బంధుమిత్ర సభ్యులందరికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ..తెలుగు నేర్చుకో, ప్రాముఖ్యాన్ని తెలుసుకో..విజయ పథకానికి చేరుకో..
జై తెలుగు తల్లి!!