
సిలికానాంధ్ర మనబడి వక్తృత్వ పోటీలు – ఆగష్టు 2021
ఆగష్టు 29 న జరగబోయే తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని సిలికానాంధ్ర మనబడి నుండి అంతర్జాల వేదికపైన, పిల్లలకు వక్తృత్వ పోటీలు Aug 28-29, 2021 న నిర్వహిస్తోంది
నమోదుకు చివరి తేదీ ఆగష్టు 22, 2021. నమోదు కొరకు: https://bit.ly/MBvaktrutvaPoteelu2021
అంశం: తెలుగు కవులు
అభ్యర్థులకు నియమాలు:
- వక్తృత్వ పోటీ తెలుగులో ఉంటుంది.
- ఈ పోటీకి ప్రస్తుత (2021 – 22) విద్యాసంవత్సరానికి, మనబడిలో పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులు మాత్రమే అర్హులు.
- నమోదు చేసుకునేటప్పుడు “పిల్లల మనబడి ఈ-మెయిల్ మాత్రమే” ఉపయోగించాలి. ఇతర ఈ-మెయిల్ id లను పరిగణించము.
(సాధారణంగా మనబడి ఈ-మెయిల్ ఈ విధంగా ఉంటుంది. పిల్లల Firstname.Lastname@manabadi.siliconandhra.org గా ఉంటుంది.)
- Zoom వివరాలు మరియు పోటీ సమయం మీరు నమోదు చేసినపుడు ఇచ్చిన మీ పిల్లల మనబడి ఈ-మెయిల్ కు పంపిస్తాము.
- విద్యార్థులు Zoom నందు పాల్గొని పోటీ నిర్వాహకుల ముందు మాట్లాడవలసి ఉంటుంది.
- Zoom వీడియోలను రికార్డు చేసుకుంటాము.
- అందరికీ మూడు నిమిషాల సమయం ఉంటుంది .
- పిల్లలు వారికి తెలిసిన ఒక కవిగారి గురించి చెప్పాలి.
(ఒకరికంటే ఎక్కువ కవుల గురుంచి చెప్పకూడదు).
- సిసింద్రీలు (6 సంవత్సరాలకు పైబడి 9 సంవత్సరాల లోపు వరకు)
- బుడుతలు (9 సంవత్సరాలకు పైబడి 12 సంవత్సరాల లోపువరకు)
- చిరుతలు (12 సంవత్సరాలకు పైబడిన వారు)
- ప్రతి భాగంలో మూడు బహుమతులు
మొదటి బహుమతి: $75.00
రెండవ బహుమతి : $50.00
మూడవ బహుమతి: $25.00
- పేర్లు నమోదుకు చివరి తేదీ: 08-22-2021
- పోటీల నిర్వహణ తేదీ: 08-28-2021/08-29-2021
- విజేతల ప్రకటన: 08-29-2021
- న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం.
- పోటీ సమయములో zoom నందు అన్ని వేళలా వీడియోను on చేసి ఉంచాలి. ఆడియో ఆఫ్ చేసుకోవాలి. మీ పేరు పిలిచినప్పుడు unmute చేసుకొని మాట్లాడాలి.
ప్రశ్నలున్నచో competitions@manabadi.siliconandhra.org ఈమెయిలు ద్వారా కానీ, (లేక) ఫోన్ ద్వారా 402-882-BADI (2234) గానీ సంప్రదించవచ్చు.
ఈ సదవకాశాన్ని పిల్లలందరూ సద్వినియోగం చేసుకొనగలరు.
ధన్యవాదములు!
సిలికానాంధ్ర మనబడి.
భాషాసేవయే భావితరాల సేవ!