BALACHANDRIKA REGISTRATIONS

సిలికానాంధ్ర మనబడి - బాలచంద్రిక - నమోదులకి ఆహ్వానం

మనబడి పిల్లలలోని సృజనాత్మక శక్తిని  వెలికి తీసే అద్భుత కార్యక్రమం!

పద్యాలు, కథలు, కవితలు,  నాటకాలు – ఈ అంశాలలో నిష్ణాతులచే ప్రత్యేక శిక్షణ!

భాషతో పాటు పిల్లల ప్రతిభాపాటవాలకు మెరుగులు దిద్దే వేదిక – “బాలచంద్రిక”!

నమోదు చేసుకొనే ముందు ఇవి చదవండి, అమోదం అయితేనే రండి. నమోదు లంకె – https://manabadi.questionpro.com/BalaChandrika2024

మీరు గతంలో పంపినట్లయితే, దయచేసి ఒక సారి మళ్ళీ పంపండి, తాజాగా విషయాలు తెలుస్తాయి.

మనబడి గురువులు, సమన్వయకర్తలకి విన్నపం – దయచేసి “బాలచంద్రిక” గురించి వివరాలు తల్లిదండ్రులతో పంచుకోండి.

బాలచంద్రికలో చేరడానికి రుసుము లేదు. పిల్లలకి తెలుగులో ప్రతిభ ఈ స్థాయిలో ఉండి ఉండాలి: –

తెలుగులో అనర్గళంగా మాట్లాడగలగాలి.

  • మాట్లాడేవి విని అర్థం చేసుకొని, అర్థవంతమైన సంభాషణలు, సందర్భోచితమైన మాటలు చెప్పగలిగి ఉండాలి.
  • ధారాళంగా చదవగలిగి ఉండాలి
  • ⁠చదివినవి అర్థం చేసుకొని ఇతరులకి వివరించగలిగి ఉండాలి, చదివిన విషయంపై ప్రశ్నలడిగితే చెప్పగలగాలి
  • ⁠తప్పులు లేకుండా తెలుగులో వ్రాయగలగాలి. చూచి వ్రాయగలగాలి
  • ⁠చెప్పినవి విని వ్రాయగలగాలి, మనసులోని ఆలోచనలని వ్రాయగలగాలి.

ఇది అసాధారణమైన కార్యక్రమం, కేవలం పిల్లల వల్ల, మనబడి జట్టు సభ్యులవల్ల మాత్రమే అయ్యే పని కాదు. పిల్లల తల్లిదండ్రులు ఇద్దరి అవగాహన, కార్యనిర్వహణ నిండుగా, మెండుగా అవసరం. ఇద్దరిలో ఒకరు కాదు, ఇద్దరూ పూర్తిగా కలిసి సమయాన్ని ఇవ్వగలగాలి.

ఇంత సమయం వెచ్చించాల్సి ఉంటుంది అని గిరి గీసి చెప్పలేం. ఎంత అవసరమైతే అంత శ్రమించగలగాలి. పిల్లల ఇతర ఒత్తిడులని బేరీజు వేసుకుంటూ అందరూ కలిసి వేసునున్న ప్రణాళిక ప్రకారం పని చెయ్యగలగాలి.

కొన్ని అర్హత కొలమానాలు నమోదు పత్రం ద్వారా పంపించాలి. అవి చూసి, బాలచంద్రిక కార్యవర్గం తీసుకునే నిర్ణయం తుది నిర్ణయం

ధన్యవాదములు
భాస్కర్ రాయవరం
ఉపాధ్యక్షుడు – సిలికానాంధ్ర మనబడి , బాలచంద్రిక
balachandrika@manabadi.siliconandhra.org