1-844-626-BADI(2234)
manabadi@siliconandhra.org

ఫ్రీమాంట్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ లో తెలుగు 3, తెలుగు 4 తరగతులకు ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ గుర్తింపు

కాలిఫోర్నియా రాష్ట్రం లోని, ఫ్రీమాంట్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ లో,  గత వారం జరిగిన స్కూల్ బోర్డ్ సర్వసభ్య సమావేశం లో సిలికానాంధ్ర మనబడి    నిర్వహించే  తెలుగు 3, తెలుగు 4 తరగతులకు   ఫారిన్  లాంగ్వేజ్ క్రెడిట్ గుర్తింపును మంజూరు చేసారు.   2014 లో  సిలికానాంధ్ర మనబడి  నిర్వహించే  తెలుగు 1 తెలుగు 2, కోర్సులకు  ఫారిన్  లాంగ్వేజ్ క్రెడిట్ గుర్తింపు లభించిన విషయం తెలిసిందే . ఈ గుర్తింపు ద్వారా, 4 సంవత్సరాల ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ నిర్దేశించే ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వ విద్యాలయాల్లో చేరడానికి  మనబడి విద్యార్ధులు అర్హత సాధిస్తారు.   ఈ అవకాశాన్ని ఫ్రీమాంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ పరిధి లోని తెలుగు విద్యార్ధులందరూ ఉపయోగించుకుని  తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు నేర్చుకోవడమే కాకుండా ఉన్నత విద్యకు కావాలసిన ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్స్  కూడా సాధించవచ్చని మనబడి డీన్ రాజు చమర్తి తెలిపారు.

 

2016-17 విద్యా సంవత్సరానికి , తరగతులు సెప్టంబర్ 10 నుండి, మిషన్ సానొసే హై స్కూల్ లో ప్రారంభం అవుతాయని, ఈ కోర్సులో చేరదలుచుకున్న విద్యార్ధులు, వెంటనే అంతర్జాలం లో manabadi.siliconandhra.org ద్వారా నమోదు  చేసుకోవాలని, పాఠ్య ప్రణాళికా విభాగం ఉపాద్యక్షులు శాంతి కూచిభొట్ల తెలిపారు.  ఈ స్కూల్ బోర్డ్ ద్వారా పూర్తి స్థాయి ఫారిన్ లాంగ్వేజ్ గుర్తింపు సాధించడంలో సంచాలకులు శ్రీదేవి గంటి విశేష కృషి సలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో దీనబాబు కొండుభట్ల, శరత్ వేట, భాస్కర్ రాయవరం, డాంజి తోటపల్లి, వెంకట్ కొండ, ఫణి మాధవ్ కస్తూరి పాల్గొన్నారు.

Menu Title